భోళాశంకర్: మంచుకొండల్లో రొమాంటిక్ సాంగ్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకతంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక పాటను పూర్తిచేసినట్లు మెహెర్ రమేష్ చెప్పుకొచ్చారు. చిరంజీవి, తమన్నాల మధ్య వచ్చే పాటను స్విట్జర్ ల్యాండ్ లో తెరకెక్కించారు. ఈ విషయాన్ని తన సోషల్ అకౌంట్ ద్వారా తెలియజేసిన మెహెర్ రమేష్, మంచు పర్వతాల్లో పాటను చిత్రీకరించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, అయినా కూడా తన టీమ్ ఎంతో అంకితభావంతో పనిచేసిందని, అందువల్లే పాట చిత్రీకరణ త్వరగా పూర్తయ్యిందని అన్నాడు. ఈ పాటకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్
స్విట్జర్ ల్యాండ్ పాట పూర్తయ్యిందనీ, టీమ్ మొత్తం హైదరాబాద్ కు తిరిగి వచ్చేస్తున్నట్లు మెహెర్ రమేష్ చెప్పుకొచ్చారు. తమిళంలో విజయం సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భోళాశంకర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి