Samantha: సమంత డ్రీమ్ ప్రాజెక్ట్: నిర్మాత మోసం బట్టబయలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజెంట్ కెరీర్ పై పూర్తి దృష్టిని సారించిన స్టార్ హీరోయిన్ సమంత,సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది.
ఇటీవల"మా ఇంటి బంగారం"సినిమా ప్రకటించిన సమంత,ప్రస్తుతం ఎలాంటి అప్‌డేట్‌లు ఇవ్వలేదు.
తాజా సమాచారం ప్రకారం, అమెజాన్ ప్రైమ్ లో"సిటాడెల్"వెబ్ సిరీస్ తో కూడా వచ్చిన ఆమెకు "ఫ్యామిలీ మ్యాన్" రేంజ్ లో అంచనాల మేరకు స్పందన రాలేదు.
ఈ కారణంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న మరో సిరీస్ "రక్త్ భ్రమండ్"పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సిరీస్ ను దర్శకుడు రహి అనిల్ బర్వే తెరకెక్కిస్తుండగా,ఆదిత్య రాయ్ కపూర్,వామిక గబ్బి,అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సిరీస్ పై నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ ఖర్చు చేస్తోందని తెలుస్తోంది.
వివరాలు
"రక్త్ భ్రమండ్" కి చిన్న బ్రేక్
అయితే, తాజా సమాచారం ప్రకారం "రక్త్ భ్రమండ్" కి చిన్న బ్రేక్ పడిందని చెబుతున్నారు.
ఈ సిరీస్ సెప్టెంబర్ 2024 లో షూటింగ్ ప్రారంభించినప్పటికీ, ఇంకా కీలక దశలోకి రాకుండానే,అర్ధ భాగం బడ్జెట్ ఖర్చైపోయింది.
ఈ విషయం చూసి టీమ్ షాక్ అయ్యింది ప్రస్తుతం కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది,దానికి వెనుక ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని గుర్తించిన వారు విచారణ ప్రారంభించారు.
నెట్‌ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్తంగా నిర్మాణం చేస్తున్న ఈ హారర్ ఫాంటసీ సిరీస్,ఇప్పటి వరకు కేవలం 26 రోజులు మాత్రమే చిత్రీకరణ జరిపిందట.
వివరాలు
కనిపించని స్థాయిలో దుబారా
ఇంకా చాలా షూటింగ్ బాలన్స్ ఉందని సమాచారం.రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ని పర్యవేక్షిస్తుండగా, దర్శకుడు రహి అనిల్ బర్వే సెట్స్‌లో చేస్తున్న మార్పులు కారణంగా నిర్మాణ వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది.
దీంతో, నెట్‌ఫ్లిక్స్ ఎంత ఖర్చు పెట్టినా, కనిపించని స్థాయిలో దుబారా అయ్యిందని యూనిట్ లో చర్చలు సాగుతున్నాయని సమాచారం.