Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్.. కంటెస్టెంట్స్ ఎవరో ఊహించవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు మరికొన్ని గంటలే మిగిలాయి. ఈ ఆదివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. దీన్ని పురస్కరించుకుని సుమారు 2 నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న తాజా ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో చాలామంది కంటెస్టెంట్లను మనం ఊహించవచ్చు. ప్రోమో నాగార్జున వాయిస్‌తో ప్రారంభమై, ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పబడింది. ఎప్పటిలాగే నాగ్ కలర్‌ఫుల్ సూట్‌లో బిగ్ బాస్ లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున స్టైలిష్ లుక్, స్వాగ్, స్టైల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
Details
ఫేస్ లను రిలీవ్ చేయని బిగ్ బాస్
బిగ్ బాస్ హౌస్ క్రొత్త, విభిన్న రేంజ్‌లో రూపొందించబడింది. కంటెస్టెంట్ల ఫేస్ ప్రివ్యూలను ప్రోమోలో రివీల్ చేయకుండా చూపించారు. అయితే జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ వస్తూ కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌లో వాయిస్-ఓవర్ ఇందు వదన, సుందర వదనా వావ్ అని వినిపిస్తుండడంతో, అతను కచ్చితంగా ఇమ్మాన్యుయేల్ అని అర్థమవుతుంది. అంతే కాకుండా లక్స్ పాప, హీరోయిన్ ఆశా శైనీ 'పిక్చర్ అబీ బాకీ హై' అని ప్రోమోలో చెప్పడం కూడా చూడవచ్చు. హకీ స్టిక్ తో కనిపించిన సీరియల్ నటుడు భరణి అని గుర్తించవచ్చు.