800 The Movie: క్రికెటర్ మురళీధరన్ బయోపిక్.. ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న '800' మూవీ తెలుగు ట్రయిలర్ విడుదలైంది.
శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసి లెజెండర్ గా పేరు సంపాదించారు.
ఆయన జీవిత ఆధారంగా తీసిన సినిమాలో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటిస్తున్నాడు.
ఇక నాజర్ వాయిస్ తో మొదలయ్యే ఈ ట్రయిలర్ సినిమాపై అసక్తిని పెంచుతోంది. ఎంఎస్ శ్రీపతి డైరక్ట్ చేసిన ఈ సినిమాను అక్టోబర్ 7న విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబైలో ఘనంగా నిర్వహించగా, 800 మూవీ ట్రైలర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సచిన్ టెండూల్కర్ హజరయ్యారు.
Details
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న 800 మూవీ
ముత్తయ్య మురళీధరన్ క్రికెటర్ అయ్యాక బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు, పరీక్షలు వంటివి ట్రైలర్ లో చూపించారు.
ట్రైలర్ చివరలో "నేను క్రికెటర్" అని మధుర్ మిట్టల్ చెప్పడం ఈ సినిమాకు హైలెట్‍గా నిలిచింది.
ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో నాజర్, నరెన్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.