Loading...
Aamir khan: మూడో పెళ్లిపై వివాదం.. ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు
మూడో పెళ్లిపై వివాదం.. ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు

Aamir khan: మూడో పెళ్లిపై వివాదం.. ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. బిష్ణోయ్ సోదరుడు అర్జూ, మరో వ్యక్తి టైసన్ మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో ఆమిర్ ఖాన్ మూడో వివాహం చేసుకోవడం ద్వారా మతపరమైన వివాదానికి కారణమయ్యారని, అలాంటి చర్యలు భారతీయ సంస్కృతికి విరుద్ధమని ఆరోపించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించిన పరిణామాలను త్వరలోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వివరాలు

పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు..

ఇటీవల ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన వివాహంపై కొందరు మతపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కూడా తాజాగా హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం.

గత కొంతకాలంగా బిష్ణోయ్ గ్యాంగ్ పలువురు బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT