Dhruv Vikram: కబడ్డీ నేపథ్యంతో రా అండ్ రస్టిక్ స్టైల్లో 'బైసన్' ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఇండియాలో ప్రముఖ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నట వారసుడిగా కొడుకు ధృవ్ విక్రమ్ ఇప్పటికే హీరోగా అడుగుపెట్టాడు. తాజాగా ధృవ్ హీరోగా నటించిన స్పోర్ట్స్-యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'బైసన్' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్ బ్యానర్‌లపై 'బైసన్' చిత్రాన్ని నిర్మించారు. మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ధృవ్‌కు జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించగా, రజీషా విజయన్ మరో ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇద్దరు నాయికలతో కథ సాగడం చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తోంది.
Details
కబడ్డీ నేపథ్యంతో కథ
బైసన్ సినిమా పూర్తిగా కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. సినిమా మొత్తం ఆ క్రీడ చుట్టూనే తిరుగుతుంది. గ్రామీణ వాతావరణం, పల్లె పోటీలు, సామాజిక పరిస్థితులు కథలో ప్రధానంగా చూపించారు. అక్టోబర్ 13వ తేదీ (సోమవారం) రాత్రి 9 గంటలకు 'బైసన్' ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బాక్సాఫీసుకు రానుంది.
Details
ట్రైలర్ హైలైట్స్
ట్రైలర్ రా అండ్ రస్టిక్ టోన్‌తో ప్రారంభమైంది. మొదట బర్రె పుర్రె సీన్ చూపించగా, చివర్లో అదే పుర్రెను హీరో తండ్రి నీళ్లలో పడేయడం సింబాలిక్‌గా ఆకట్టుకుంది. గ్రామ పర్యావరణం, రాజకీయాలు, హత్యలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ కలిసినట్టుగా కనిపించాయి. ధృవ్ పాత్రలో కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్‌తో లవ్ ట్రాక్, కుటుంబ విభేదాలు, తండ్రి వ్యతిరేకత, ఓ పోలిటికల్ యాంగిల్, హింస, హత్యలు ఇలా విభిన్న భావోద్వేగాలను ట్రైలర్ చూపించింది. ట్రైలర్‌లో థ్రిల్లింగ్ ఎంగేజ్‌మెంట్ అంతా కనిపించింది. చివరిలో ధృవ్ చేయికి కట్టు ఉండగా పుషప్స్ చేసే సీన్ ప్రత్యేకంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌గా ఉండి ట్రైలర్‌కు ఎనలేని ఇంపాక్ట్ ఇచ్చింది.