Page Loader
Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది
మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది

Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ తారలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, టబు, నీలం, సోనాలీ బింద్రేలను గతంలో నిర్దోషులుగా విడుదల చేయడం మీద రాజస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హైకోర్టును ఆశ్రయించింది. తాజా విచారణ జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. తదుపరి విచారణ తేదీగా జూలై 28ను నిర్ణయించారు. ప్రభుత్వ న్యాయవాది మహిపాల్ విష్ణోయ్ వెల్లడించిన వివరాల ప్రకారం 1998 అక్టోబర్ 1న 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో జోధ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో బాలీవుడ్ తారలు కొందరు కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలొచ్చాయి.

Details

చిక్కుల్లో బాలీవుడ్ తారలు

ఈ కేసులో విచారణ అనంతరం, 2018 ఏప్రిల్ 5న ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. అయితే అదే కేసులో ఇతర ఆరోపితులైన సైఫ్ అలీఖాన్‌, టబు, సోనాలి బింద్రే, దుష్యంత్ సింగ్‌లపై తగిన ఆధారాలు లేవంటూ కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ నిర్దోషసాక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తగిన ఆధారాలు ఉన్నాయని వాదిస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీంతో గతంలో ముగిసినట్లే కనిపించిన ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.