థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే?
తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా విడుదలైన బేబి మూవీ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. జులై 14వ తేదీన రిలీజైన ఈ సినిమా, ఇప్పటివరకు 85కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ బేబి సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కెరీర్ లో బేబి సినిమా మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోయిన్ గా వైష్ణవి చైతన్యకు మంచి ఎంట్రీ వచ్చింది. తాజాగా బేబి సినిమా ఓటీటీ విడుదలపై వార్త వచ్చింది. మరికొద్ది రోజుల్లో ఓటీటీలో అందుబాటులో ఉండనుందని అంటున్నారు. ఆగస్టు 18వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ఛానల్ లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఈ విషయమై అధికారికంగా సమచారం బయటకు రాలేదు.
ఓటీటీలో 4గంటల బేబి
బేబి సినిమాను థియేటర్లలో చూసినవాళ్ళు నిడివి కొంచెం ఎక్కువైందని అన్నారు. అయితే ఓటీటీలో ఆ నిడివి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 4గంటల సినిమా ఓటీటీలో విడుదల కానుందని చెబుతున్నారు. మరిన్ని ఎమోషనల్ సీన్స్, ఒక పాటను యాడ్ చేసిన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. బేబి సినిమాకు సినిమా ఇండస్ట్రీ పెద్దల నుండి మంచి మెచ్చుకోలు లభించింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ప్రత్యేకంగా బేబి సినిమాపై ప్రశంసలు కురిపించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబి సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించారు.