LOADING...
Avneet Kaur : కోహ్లీ లైక్‌పై చివరికి రియాక్ట్‌ అయిన బోల్డ్ బ్యూటీ అవ్‌నీత్‌ కౌర్
కోహ్లీ లైక్‌పై చివరికి రియాక్ట్‌ అయిన బోల్డ్ బ్యూటీ అవ్‌నీత్‌ కౌర్

Avneet Kaur : కోహ్లీ లైక్‌పై చివరికి రియాక్ట్‌ అయిన బోల్డ్ బ్యూటీ అవ్‌నీత్‌ కౌర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలిచే బోల్డ్‌ బ్యూటీ అవ్‌నీత్‌ కౌర్. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోజులతో విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అయితే, ఆమె లైఫ్ ఇంతలా మారిపోవడానికి విరాట్‌ కోహ్లి కారణమని చెబుతుంటారు. అసలు విషయం ఏమిటంటే - ఒకసారి విరాట్‌ కోహ్లీ, అవ్‌నీత్‌ కౌర్ ఫ్యాన్‌ పేజీలోని ఓ ఫోటో పోస్టుకు పొరపాటున లైక్‌ చేశారు. అదే ఆమె కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఆ ఘటన తర్వాత అవ్‌నీత్‌ ఫాలోయింగ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొత్తగా 1మిలియన్‌కి పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. అదికాకుండా12 బ్రాండ్లకు సైన్‌ చేసే అవకాశం కూడా దక్కింది. ఇదేసమయంలో విరాట్ కోహ్లీపై ట్రోల్స్‌ కూడా వెల్లువెత్తాయి. ఈ వివాదంపై కోహ్లీ స్వయంగా స్పందించాడు.

Details

సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్

''నా ఫీడ్‌ను క్లియర్‌ చేస్తుండగా అల్గారిథం పొరపాటున ఆ ఇంటరాక్షన్‌ నమోదైనట్లు అనిపిస్తుంది. దాని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. కావున అనవసర ఊహాగానాలు చేయొద్దని కోరుతున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ లైక్‌ ఎపిసోడ్‌పై తాజాగా అవ్‌నీత్‌ కూడా రియాక్ట్‌ అయ్యింది. తన అప్‌కమింగ్‌ మూవీ 'లవ్‌ ఇన్‌ వియత్నాం' ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ విషయంపై స్పందించింది. చిరునవ్వుతో మాట్లాడుతూ మిల్తా రహే ప్యార్.. ఔర్ క్యా హి కేహ్ సక్తి హూ (ప్రేమ దొరుకుతూనే ఉండాలి.. నేను ఇంతకంటే ఇంకేం చెప్పగలను)' అని తెలిపింది. ప్రస్తుతం ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.