ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
యాక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా బాలీవుడ్ సినిమాకు విశేష సేవలందించిన సతీష్ కౌషిక్, 66ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసారు.
కమెడియన్ గా బాలీవుడ్ జనాలను అలరించిన సతీష్ కౌషిక్, దర్శకుడిగా రూప్ కీ రాణి చోరోంకా రాజా, ప్రేమ్, హమ్ ఆప్కే దిల్ మే రహ్ తా హై, తేరే నామ్, కాగజ్ చిత్రాలను రూపొందించారు. ఎన్నో హిందీ చిత్రాల్లో నటించిన సతీష్, మిస్టర్ ఇండియా సినిమాలోని క్యాలెండర్ పాత్రకు మంచి పేరు తెచ్చుకున్నారు.
అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, మధుర్ బండార్కర్.. సతీష్ కౌషిక్ కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023