Hema Malini : వినేష్ ఫోగట్ కేసులో హేమమాలిని ఎందుకు ట్రోల్ అవుతున్నారు?
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంతో దేశవ్యాప్తంగా నిరాశ నెలకొంది. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో, వినేష్‌కు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కూడా తన మద్దతు వ్యక్తం చేశారు. దీంతో హేమమాలిని పై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీని వల్ల భారతదేశం మొత్తం ప్రజలు చాలా బాధపడ్డారు. ఆమె బరువు నిర్దేశించిన ప్రమాణాల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నందున ఆమె ఆట నుండి తొలగించారు. నటి హేమమాలిని ఏదో మాట్లాడటం వలన వారు చాలా ట్రోల్ అయ్యారు.
వినేష్ గురించి హేమ ఏం అన్నారు?
నిజానికి, హేమమాలిని పార్లమెంటు వెలుపల ఈ విషయంపై స్టేట్‌మెంట్ ఇవ్వమని కోరినప్పుడు, ఆమె పిటిఐతో మాట్లాడుతూ, 'ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అలాగే, వింత. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది. సరైన శరీర బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కళాకారులకు, మహిళలకు ఇదొక గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్ పతకమైతే రాదు కదా' అంటూ వ్యంగ్యంగా నవ్వారు హేమ మాలినీ.
హేమాను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన క్రీడాభిమానులు, నెటిజన్లు హేమ మాలినీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే హేమమాలిని ఎంపీగా ఉండేందుకు అనర్హురాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు 'హేమ మాలిని ఇలాంటి విషయంపై స్టేట్‌మెంట్ ఇస్తూ ఎలా నవ్వుతారు' అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఇందులో నవ్వడానికి ఏముంది?'