LOADING...
Kajol Deepfake Video: కాజోల్ డీఫ్ ఫేక్ వీడియో వైరల్.. మొన్న రష్మిక నేడు కాజోల్
కాజోల్ డీఫ్ ఫేక్ వీడియో వైరల్.. మొన్న రష్మిక నేడు కాజోల్

Kajol Deepfake Video: కాజోల్ డీఫ్ ఫేక్ వీడియో వైరల్.. మొన్న రష్మిక నేడు కాజోల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2023
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ సెలబ్రెటీలను డీప్ ఫేక్ వీడియోలు వెంటాడుతూనే ఉన్నాయి. హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మోడల్ జారా పటేల్ క్లీవేజ్ షో వీడియోను మార్ఫింగ్ చేసి, రష్మిక్ ఫేస్ పెట్టారు. అయితే అది ఫేక్ వీడియో అని తేలింది. తాజాగా ఇలాంటి చేదు ఘటనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌కు ఎదురైంది. కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో 11 సెకన్ల వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. కాజోల్ బట్టలు మార్చుకునే వీడియోను ఓ influencer పోస్ట్ చేయగా, దీనికి కాజోల్ ఫేస్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఫిక్స్ చేశారు.

Details

అజయ్ దేవగన్ ఫ్యాన్స్ ఫైర్

దీన్ని ఎడిట్ చేసిన వారిపై కాజోల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే కాజోల్ ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన ఈ వీడియో టిక్ టాక్ స్టార్ రోసిబీరిన్స్ గా గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రెటీలు కోరుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు ప్రమాదకరంగా మారుతున్నారు. కాజోల్ వీడియో ఘటనపై అజయ్ దేవగన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయకూడదని ఫ్యాన్స్ కోరుతున్నారు.