
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్' పేరుతో బాలీవుడ్ మూవీ ప్రకటన.. పోస్టర్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ సిందూర్' పేరిట శత్రుదేశం గుండెల్లో రగిలిపోతున్న ఆపరేషన్‌ను ఇప్పుడు వెండితెరపై ఆవిష్కరించనున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన 'ఆపరేషన్ సిందూర్' ఆధారంగా ఓ బాలీవుడ్ చిత్రం రాబోతోంది.
అధికారికంగా ఈ సినిమాను ప్రకటించడమే కాకుండా, ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహించనున్నారు.
నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించనున్నారు.
విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సైనిక యూనిఫార్మ్ ధరించి, రైఫిల్ పట్టుకుని, నుదిటిపై సింధూరం దిద్దుకుంటున్న మహిళను చూపించారు.
Details
త్వరలోనే నటీనటుల వివరాలు
అదే సమయంలో బ్యాక్‌డ్రాప్‌లో ఫైటర్ జెట్‌లు ఎగిరిపోతుండగా, యుద్ధ భూమి మండుతున్నట్లు చూపించారు.
ఇది చూస్తుంటే, ప్రస్తుతం భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పహల్గాం ఘటన నేపథ్యంగా చిత్రాన్ని రూపొందించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. 'ఆపరేషన్ సిందూర్' పేరును రిజిస్టర్ చేసుకునేందుకు దాదాపు 15 నిర్మాణ సంస్థలు ముందుకొచ్చినట్లు సమాచారం.
ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో జీ స్టూడియోస్, టీ-సిరీస్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేశాయని తెలుస్తోంది.