Page Loader
Kannappa: కన్నప్ప కోసం హైదరాబాద్ కి బాలీవుడ్ స్టార్ హీరో 
కన్నప్ప కోసం హైదరాబాద్ కి బాలీవుడ్ స్టార్ హీరో

Kannappa: కన్నప్ప కోసం హైదరాబాద్ కి బాలీవుడ్ స్టార్ హీరో 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2024
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ డైనమిక్ స్టార్ -నిర్మాత మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తారని కొద్దిరోజుల క్రితమే కన్ఫర్మ్ అయింది. ఈరోజు అక్షయ్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ సినిమాలో కీలక క్యామియోలో అయితే అక్షయ్ కనిపించనున్నారని అందుకే హైదరాబాద్ కి తాను వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్షయ్ కి మంచు విష్ణు ఆహ్వానం పలుకగా ఈ విజువల్స్ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. కన్నప్ప సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్న అక్షయ్‌కి నటీనటుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Details 

కీలకపాత్రలలో ప్రముఖ నటులు 

మరి వీరి కలయికలో ఎలాంటి సీన్స్ ఉంటాయో చూడాలి. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు ప్రభాస్, నయనతార, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, మధుబాల,ఇతర తారలు కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అక్షయ్ కుమార్ కి స్వాగతం చెబుతున్న మంచు విష్ణు