
Kota Srinivasa Rao Death : 'అరేయ్ ఒరేయ్ అని పిలిచేవాడివి'.. లైవ్‌లో ఏడ్చేసిన బ్రహ్మనందం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నాలుగు దశాబ్దాలకు పైగా నటనతో ప్రేక్షకులను మెప్పించిన కోటా, పరిశ్రమలోని ఎంతోమంది నటులతో తన అనుబంధాన్ని కొనసాగించారు. ఆయన మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ముందుగా వచ్చిన హాస్యనటుడు బ్రహ్మానందం పుష్పాంజలి ఘటించి, మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కోట శ్రీనివాసరావు ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుసు. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోటా, నేనూ, బాబుమోహన్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం. రోజుకు 18 గంటలు పనిచేసే రోజులూ ఉన్నాయ్. మేం నలభై ఏళ్లుగా కలసి పని చేస్తున్నాం.
Details
మధ్యాహ్నం 3:30 గంటలకు అంత్యక్రియలు
ఆ అనుబంధం మర్చిపోలేనిదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మేమంతా 'అరేయ్, ఒరేయ్' అంటూ పిలుచుకునే స్నేహితులు. ఈ రోజు కోట లేడంటే నమ్మలేకపోతున్నా. ఆయన నటన ఉన్నంతకాలం ఆయన గుర్తుగా మిగిలిపోతాడు. వాడొక నట రాజపుత్రుడు, మహానుభావుడు. ఆయనలాంటి నిర్మొహమాట వ్యక్తిని కోల్పోవడం దేశానికీ, చిత్రసీమకీ తీరని లోటు అంటూ ఉద్వేగంగా స్పందించారు. కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నాడు. నటనా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన కోట శ్రీనివాసరావుకి తెలుగు సినిమా ప్రపంచం ఘన నివాళి అర్పిస్తోంది.