
Tollywood-Teaser-Etv win-OTT: నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కామెడీ సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ టెండ్ సెట్టర్ జోనర్ అంటే కామెడీనే.
వరుసగా ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో కామెడీ సినిమాలు క్యూ కడుతున్నాయి.
కామెడీకి కేరాఫ్ నిలిచిన జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వరుసపెట్టి కామెడీ చిత్రాలు రూపొందించారు.
ఆ తర్వాత కాలంలో శ్రీను వైట్ల, ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ప్రధానంగా చిత్రాలు రూపొందిస్తున్నారు.
ఇంతకీ విషయమేమిటంటే నరేష్, బ్రహ్మానందం ప్రధానపాత్రలో సుధీర్ పుల్లట్ల దర్శకత్వంలో 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఓకామెడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈ చిత్రంలో కీడాకోలా ఫేమ్ రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Brahmanandam-Naresh
టీజర్, పోస్టర్ లకు పాజిటివ్ వైబ్స్
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి.
రోడ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లో పాతకాలం నాటి ఓ వాహనంలో ఓ కుటుంబం మొత్తం గోవా టూర్ కు వెళ్తున్నట్లు చూపించారు.
వ్యాన్ పైన లగేజీతో పాటు అస్థికల కుండ కనిపించడం పై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయాన్ని ఇంకా అధికారికంగా మేకర్స్ వెల్లడించలేదు.
ఈ చిత్రాన్నిబి.బాపినీడు, ఈదర సుధీర్ లు నిర్మిస్తున్నారు.