LOADING...
గ్రాండ్‌గా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. తరలివచ్చిన ప్రముఖులు
గ్రాండ్‌గా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. తరలివచ్చిన ప్రముఖులు

గ్రాండ్‌గా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. తరలివచ్చిన ప్రముఖులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు గౌతమ్ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్యను బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ వివాహమాడారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్,మంత్రి తలసాని యాదవ్, ఎర్రబల్లి దయాకర్, రామ్ చరణ్ హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అతనికి సినిమాలపై పెద్దగా ఇష్టం లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

Details

నూతన వధూవరులకు శుభాకాంక్షల వెల్లువ

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మెగస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, కోట శ్రీనివాస రావు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, ఆలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, కెఎల్ నారాయణ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడియన్‌గా ఎంతో పలుకుబడి ఉన్న బ్రహ్మనందం తన కుమారులను సినీ ఇండిస్ట్రీలో నిలదిక్కుకునేలా చేయడంలో మాత్రం విఫలమయ్యారు. బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్‌తో కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో తన ముద్రను వేసుకున్నాడు. అనేక వేల చిత్రాల్లో నటించి భవిష్యత్తులో చెరగని, తనకు సాటిరాని హాస్యాన్ని బ్రహ్మానందం పండించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెళ్లికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్