
Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఏమన్నారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
తమన్నా, విజయ్ వర్మల ప్రేమకథ ఇప్పుడు బ్రేకప్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. 'లస్ట్ స్టోరీస్ 2' ద్వారా పరిచయమైన ఈ జంట, కొంతకాలానికే ప్రేమలో పడిపోయారు.
దాదాపు రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇటీవల విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో విజయ్ వర్మ తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదించాలి. అందులో వచ్చే ప్రతి అనుభూతిని స్వీకరించాలి. సంతోషం, బాధ, కోపం, చిరాకు... ఇవన్నీ సహజమే. వాటిని అంగీకరించి ముందుకు సాగాలని ఆయన అన్నారు.
ఇదే సమయంలో తమన్నా కూడా ప్రేమపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నిజమైన ప్రేమను నమ్ముతానని, దానిని వ్యాపార లావాదేవీలా మార్చినప్పుడే సమస్యలు మొదలవుతాయని అన్నారు.
Details
రిలేషన్‌షిప్‌లో లేనప్పుడే ఆనందంగా ఉన్నా
రిలేషన్‌షిప్‌లో లేనప్పుడే తాను మరింత ఆనందంగా ఉన్నానని, భాగస్వామి ఎంపికలో జాగ్రత్త అవసరమని సూచించారు.
'లస్ట్ స్టోరీస్ 2' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ, రిలేషన్‌లో ఉన్న సమయంలో ప్రతి ఫంక్షన్‌కు కలిసి హాజరయ్యేవారు.
కానీ ఇటీవల ఈ జంట ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ అయ్యారనే ప్రచారం మొదలైంది. వీరి విడిపోతున్న వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే, రవీనా టాండన్ నిర్వహించిన హోళీ వేడుకలకు వీరిద్దరూ వేర్వేరుగా హాజరయ్యారు.
తమన్నా షేర్ చేసిన ఫొటోల్లో విజయ్ కనిపించలేదు, విజయ్ ఫొటోల్లో తమన్నా జాడ లేకపోవడం, వీరి బ్రేకప్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.