మంచు మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్లాన్ చేస్తున్న బ్రో సినిమా నిర్మాతలు?
ఈ వార్తాకథనం ఏంటి
మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా ఏళ్ళు ఐపోయింది. అనేక కారణాల వల్ల సినిమాల్లో మంచు మనోజ్ నటించలేకపోయారు.
అయితే కొన్నిరోజుల క్రితం వాట్ ద ఫిష్ పేరుతో సినిమాను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన విషయాలేవీ బయటకు రాలేదు.
తాజాగా మంచు మనోజ్ గురించి క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఒకానొక టాక్ షో హోస్ట్ గా మంచు మనోజ్ వ్యవహరించనున్నారని వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీ ఛానల్ నిర్వహించే టాక్ షోలో మంచు మనోజ్ హోస్ట్ గా తీసుకోవాలని బ్రో నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
Details
జీ5 ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు
పవన్ కళ్యాణ్ హీరోగా కనిపించిన బ్రో సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ నిర్మాణ సంస్థలుగా ఉన్నాయి. మరి జీ5 ఓటీటీ ఛానల్ కోసం మంచు మనోజ్ ని సంప్రదించారా లేదా అనేది చుడాలి.
మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మీ, టాక్ షోల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమతో మీ లక్ష్మీ పేరుతో ఆమె చేసిన టాక్ షో అప్పట్లో ఎంతో ఆదరణ అందుకుంది.
మరి ప్రచారంలో ఉన్నట్టు మంచు మనోజ్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తాడా లేదంటే కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.