బ్రో సినిమా శ్యాంబాబు కాంట్రవర్సీ: అంబటి రాంబాబు వార్నింగ్ పై సాయి ధరమ్ తేజ్ రెస్పాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా, థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గరి నుండి అందులోని శ్యాంబాబు పాత్ర కాంట్రవర్సీగా మారింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఈ పాత్రను తీర్చిదిద్దారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ విషయమై అంబటి రాంబాబు స్పందించారు.
బ్రో సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ ప్రకటించారు. కానీ అదంతా తప్పుడు సమాచారమని, బ్రో సినిమా కలెక్షన్లు అంతగా లేవనీ, సినిమా పోయిందని అంబటి రాంబాబు అన్నారు.
అంతేకాదు ఆ సినిమాలోని పాత్రలను మలిచిన తీరుపై అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఈ వార్నింగ్ పై సాయి ధరమ్ తేజ్ స్పందించారు.
Details
సినిమాను సినిమాగా చూడాలంటూ హితవు
సినిమాను సినిమాగానే చూడాలనీ, సినిమాకు, రాజకీయాలకు ముడి పెట్టొద్దని, మంత్రి అంబటి రాంబాబు గారిని కించపరచాలనే ఉద్దేశ్యంతో ఆ సీన్ పెట్టలేదని, బ్రో సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన సాయి ధరమ్ తేజ్ అన్నారు.
తమిళ చిత్రమైన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో తెరకెక్కింది. రేపటి గురించి ఆలోచించే మనిషి, ఈరోజు సరిగ్గా జీవించలేక పోతున్నాడనే కాన్సెప్ట్ తో బ్రో మూవీ తెరకెక్కింది.
ఈ సినిమాలో కాల పురుషుడిగా పవన్ కళ్యాణ్ కనిపించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.