Aditya Dhar-Allu Arjun: బన్నీ-ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
ఈ వార్తాకథనం ఏంటి
'ధురంధర్'తో హిట్ అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ మరో భారీ ప్రాజెక్ట్ పైపైన పెట్టుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా నేరేట్ చేశాడని సమాచారం. ప్రాజెక్ట్ ఈ సమయంలో డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. 'ధురంధర్ 2' థియేటర్లలో విడుదలైన తర్వాతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ పీక్‌లో ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే AA22, AA23వంటి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Details
అల్లు అర్జున్ ఖాతాలో రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులు
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా కూడా చర్చలలో ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించగలదని అంచనా. ఇప్పటికే అల్లు అర్జున్ ఖాతాలో రెండు వెయ్యి కోట్ల బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంతో మూడో 1000 కోట్ల బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. ఆదిత్య ధర్-అల్లు అర్జున్ కాంబినేషన్ న్యూస్ సినీ పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే అది నిజంగానే పాన్ ఇండియా స్టార్మ్ అవుతుంది.