Page Loader
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ
పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌ జన్మదిన వేడుకల సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ బర్తడే విషెస్ చెప్పారు. 'మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు' అని బన్నీ ట్వీట్ చేశారు. ఇది మెగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అటు సినిమా స్టార్లతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Details

శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకమని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు. తనలాంటి ఎంతోమందికి ఈ ఏడాది మరిచిపోలేని బహుమానం లభించిందని, ఉన్నత విలువ ఉన్న పవన్ కళ్యాన్ డిప్యూటీ సీఎంగా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ప్రత్యేకమన్నారు. నిండు నిరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.