Page Loader
Keerthy Suresh: రాజకీయాలలోకి కీర్తి సురేష్..ఏ పార్టీలో చేరనుంది?
రాజకీయాలలోకి కీర్తి సురేష్..ఏ పార్టీలో చేరనుంది?

Keerthy Suresh: రాజకీయాలలోకి కీర్తి సురేష్..ఏ పార్టీలో చేరనుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ తారలు ఎప్పుడు ఎలా మారతారో ఊహించలేం. ఒక్కొక్కసారి వారి జీవితాల్లో అనూహ్య మలుపులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా నటి కీర్తి సురేష్‌ జీవితం కూడా అచ్చంగా అలాంటి మార్పులతో వార్తల్లోకి వచ్చింది. బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఈమె, తొలుత ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వాలనుకుందట. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఆ కలల్ని పక్కన పెట్టి, నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. తొలిగా 'ఇదు ఎన్నమాయం' అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌కి పరిచయం అయిన కీర్తి,ఆ సినిమా విజయంతో నటిగా మంచి ఆరంభం పొందారు.

వివరాలు 

 'బేబీ జాన్‌' చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ 

ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు విజయవంతమవుతూ, స్టార్‌ హీరోయిన్‌గా నిలిపాయి. ముఖ్యంగా తెలుగులో 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్ర పోషించి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుని జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. తర్వాత హిందీలో 'బేబీ జాన్‌' అనే చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించారు. వ్యక్తిగతంగా చూస్తే,15ఏళ్లుగా స్నేహితుడిగా ఉన్న వ్యక్తిని గత ఏడాది చివరిలో వివాహం చేసుకుని గృహిణిగా మారారు. ఈ వివాహం తర్వాత, ఆమెకు సినిమాల్లో అవకాశాలు కొంత తగ్గినట్టు కనిపిస్తోంది. అలాగే వరుసగా సినిమాలు ఫ్లాప్‌ కావడమూ ఒక కారణంగా భావిస్తున్నారు. వివాహానంతరం కీర్తి ఎలాంటి కొత్త సినిమాల్లో నటించలేదు.అయితే,ఆమె గతంలో నటించిన 'ఉప్పు కప్పురంబు' అనే చిత్రం మాత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది.

వివరాలు 

"టీవీకే.. టీవీకే.."అంటూ నినాదాలు

సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ,వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలి కాలంలో మదురైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కీర్తిని చూసిన కొందరు అభిమానులు"టీవీకే.. టీవీకే.."అంటూ నినాదాలు చేశారు. 'టీవీకే'అంటే నటుడు విజయ్‌ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు.కీర్తిసురేష్‌ గతంలో విజయ్‌తో కలిసి రెండు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో కీర్తి త్వరలో టీవీకే పార్టీలో చేరతారన్న ఊహాగానాలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈవిషయంపై ఆమె ఎలాంటి స్పందన ఇవ్వలేదు.దీనితో ఆమెకు రాజకీయాల్లో ఆసక్తి ఉందని,విజయ్‌ పార్టీకి జాయిన్‌ కావాలనుకుంటున్నారని ప్రచారం బలపడింది. అందుకే అభిమానులు ఆమెను చూసిన వెంటనే పార్టీనినాదాలతో స్పందించారు.ప్రస్తుతం నటి కీర్తిసురేష్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సినీ,రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.