Preeti Jhangiani Husband: కారు యాక్సిడెంట్.. నటి ప్రీతి జింగ్యానీ భర్త పరిస్థితి విషమం
బాలీవుడ్ నటుడు పర్విన్ దబాస్ ఇవాళ శనివారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 50 ఏళ్ల ఈ నటుడు, దర్శకుడు ప్రస్తుతం బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ముంబైలో తన కారు నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పర్విన్ దబాస్ పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అతని భార్య ప్రీతి ఝాంగియాని ప్రస్తుతానికి ఆసుపత్రిలో ఉన్నారు. ప్రీతి తెలుగులో తమ్ముడు సినిమాతో సహా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
షాక్ లో ప్రీతి ఝాంగియాని కుటుంబం
ఈ ప్రమాదంపై ప్రీతి ఝాంగియాని స్పందించింది. తాను, తన కుటుంబం షాక్‌లో ఉన్నామని, పర్విన్‌కు తీవ్రమైన కంకషన్ ఉందని, వైద్యులు CT స్కాన్లు, ఇతర పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. తెల్లవారుజామున డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పారు. ప్రీతి, పర్విన్ దబాస్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రీతి ఝాంగియాని 2008లో ఆదిత్య చోప్రా చిత్రం 'మొహబ్బతే'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.