Page Loader
KBC 16: 'KBC 16' రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌.. ఎవరీ చందర్‌ ప్రకాశ్‌?
'KBC 16' రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌.. ఎవరీ చందర్‌ ప్రకాశ్‌?

KBC 16: 'KBC 16' రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌.. ఎవరీ చందర్‌ ప్రకాశ్‌?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (Kaun Banega Crorepati) అనే టీవీ షోకు పరిచయం అవసరం లేదు. చాలా సీజన్ల నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ షో ప్రస్తుతం 16వ సీజన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో 22 ఏళ్ల యువకుడు చందర్‌ ప్రకాశ్‌ (Chander Prakash) సంచలనం సృష్టించాడు.అతను ఒకటి కోట్లు గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ, రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి తప్పుకున్నాడు.

వివరాలు 

రూ.కోటితో పాటు కారును కూడా బహుమతిగా పొందాడు 

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. ''ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ 'శాంతి నివాసం'అనే అరబిక్‌ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది'' అని అమితాబ్‌ అడిగాడు. జవాబు కోసం ఉన్న నాలుగు ఆప్షన్లలో చందర్‌ 'డబుల్ డిప్‌' లైఫ్‌లైన్‌ను ఉపయోగించి ఆప్షన్‌ సి. టాంజానియాను ఎంచుకున్నాడు,ఇది సరైన జవాబుగా నిర్ధారించబడింది. దీంతో అతను రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించారు. ఈ సందర్భంగా షోలో ఉన్నవారు అతడిని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు,అమితాబ్‌ అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రూ.కోటితో పాటు ఓ కారును కూడా బహుమతిగా పొందాడు.

వివరాలు 

రూ.7కోట్లు వచ్చేవే కానీ.. 

చందర్‌ ప్రకాశ్ ఆ తర్వాత రూ.7 కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. ''1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్‌ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'' అని అమితాబ్‌ ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్‌కు జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే అన్ని లైఫ్‌లైన్లు వినియోగించుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి క్విట్‌ అయ్యాడు. తరువాత, అమితాబ్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని కోరాడు. అతను ఆప్షన్‌ ఎ. వర్జనీయా డేర్‌ అని చెప్పగా, అదే సరైన జవాబు అని బిగ్‌బీ తెలిపారు.

వివరాలు 

చందర్‌ ప్రకాశ్ ఎవరు? 

22 ఏళ్ల చందర్‌ ప్రకాశ్ జమ్మూ కశ్మీర్‌కు చెందినవాడు. ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు, అతను పేగులో పూడిక కారణంగా ఇప్పటివరకు ఏడు సార్లు సర్జరీ చేయించుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

kbc 16 వీడియో ఇదే