Page Loader
Shruti Hassan : 'డెకాయిట్‌'లో మార్పులు.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్ 
'డెకాయిట్‌'లో మార్పులు.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్

Shruti Hassan : 'డెకాయిట్‌'లో మార్పులు.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్‌కు అడుగుపెట్టి 'ఐరన్ లెగ్' అనే ముద్రను చెలామణీ చేసింది. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాపులు అయ్యాయి. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలో ప్రవేశించిన శృతి, తన తండ్రి ఇమేజ్‌ను ఉపయోగించుకోకుండా, హీరోయిన్‌గా తన ప్రతిభను నిరూపించుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆమె కెరీర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చింది. దానికి విమర్శకుల ప్రశంసలు అందాయి. టాలీవుడ్‌లో శృతి అనేక స్టార్ హీరోలతో నటించింది.

Details

నిర్మాతగా వ్యవహరిస్తున్న సుప్రియ యార్లగడ్డ 

గతేడాది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్' చిత్రంలో నటించడం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. తాజాగా అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డెకాయిట్' ప్రాజెక్ట్‌లో ఆమె పాత్ర గురించి ప్రచారం జరిగింది. ఇందులో శృతి అడివి శేష్‌కు జోడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శృతి, అడివి శేష్ వరుస దోపిడీలకు పాల్పడుతూ, అదే సమయంలో ప్రేమలో పడతారని సమాచారం. అయితే, త్వరలో ప్రారంభం కావాల్సిన రెగ్యులర్ షూటింగ్ సమయంలో శృతి హాసన్ ఈ చిత్రంలో నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.