Chennai Love Story: 2026 సమ్మర్ బరిలో.. సాయి రాజేష్ కథతో కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్టులతో వేగంగా ముందుకెళ్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్ ఖరారైంది. 'బేబీ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రానికి కథను సమకూర్చడమే కాకుండా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై SKNతో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు.
వివరాలు
సినిమాపై అంచనాలను పెంచిన గ్లింప్స్
ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, 'మ్యాడ్', 'లవర్' చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా కిరణ్ అబ్బవరంతో జతకడుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రబృందం ఈ మూవీ విడుదల వివరాలను ప్రకటిస్తూ, దీనిని సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్
This Summer ❤️#ChennaiLovestory #MassMoviemakers #AmruthaProductions #HappyNewYear pic.twitter.com/yPJhzznfSZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 1, 2026