Page Loader
Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్, వైరముత్తు.. ఆయనపై మండిపడ్డ సింగర్ చిన్మయి 
ఆయనపై మండిపడ్డ సింగర్ చిన్మయి

Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్, వైరముత్తు.. ఆయనపై మండిపడ్డ సింగర్ చిన్మయి 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 02, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తలకెక్కారు. తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె గతంలో లైంగిక ఆరోపణలు చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి వైరముత్తు ఒకే వేదికను పంచుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు ఫోటోను ట్వీట్ చేసిన చిన్మయి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాపై నిషేధం ఉన్న సమయంలో నన్ను వేధించించిన వ్యక్తితో తమిళనాడు శక్తివంతమైన వ్యక్తులు ఒకే వేదిక పంచుకున్నారు. నా కెరీర్‌లో కొన్నేళ్లను కోల్పోయానని చిన్మయి ట్వీట్ చేశారు. వైరముత్తు 'మహా కవితై' అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా స్టాలిన్, చిదంబరం, కమల్ హాసన్‌ సంయుక్తంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వారిపై సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్