Chiranjeevi: 70 ఏళ్ల వయసులోనూ తగ్గని ఉత్సాహం.. 'మెగా 158' కోసం 12 గంటలపాటు వర్షంలో చిరంజీవి షూటింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, నిజమైన అంకితభావం ముందు అది ఎలాంటి అడ్డంకి కాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. దాదాపు 70 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస చిత్రాలతో బిజీగా కొనసాగుతున్న ఆయన, తనలోని ఉత్సాహం, క్రమశిక్షణ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాయని చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'మెగా 158' (వర్కింగ్ టైటిల్) సినిమా కోసం చేస్తున్న కృషి సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది.
వివరాలు
రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో కీలక యాక్షన్ సన్నివేశాలు..
ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా వర్షం నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ ఫైట్ ఎపిసోడ్ కోసం చిరంజీవి ఏకధాటిగా 12 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. వర్షంలో పూర్తిగా తడుస్తూనే క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చిరంజీవి చూపించిన అంకితభావాన్ని చిత్ర బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే వ్యాయామంతో తన దినచర్యను ప్రారంభించే ఆయన క్రమశిక్షణ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని యూనిట్ సభ్యులు వెల్లడించారు.
వివరాలు
కీలక పాత్రల్లో ఆ హీరోయిన్లు..
అంతేకాదు 12 గంటలపాటు వర్షంలోనే కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌ను ఎలాంటి అలసట లేకుండా పూర్తి చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. "అలాంటి అంకితభావమే ఆయనను మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లింది" అని చిత్ర బృందం అభిప్రాయపడింది. ఈ చిత్రంలో నివేద పేతురాజ్, అనశ్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..
MEGASTAR – THE BENCHMARK OF DEDICATION. ❤️🔥
— Team Megastar (@MegaStaroffl) July 9, 2026
Megastar @Kchirutweets Garu is spending nearly 12 hours filming one of the toughest rain-soaked action sequences for #MEGA158, envisioned by @dirbobby and choreographed by Ram-Lakshman Masters🔥
Beginning his day at 4 AM with an… pic.twitter.com/RVU2hzNaMq