Page Loader
Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్ 
చిరంజీవి 157వ సినిమా ప్రకటన

Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 22, 2023
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అప్డేట్ ఇప్పుడే వచ్చింది. బింబిసార సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ట, చిరంజీవి 157వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా అప్డేట్ ఇచ్చేసింది. సినిమాను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా కొత్తగా ఉంది. బింబిసార మాదిరిగా ఫాంటసీ అంశాలతో చిరంజీవి 157వ సినిమా ఉండబోతుందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి ఈసారి చిరంజీవి నుండి విభిన్నమైన సినిమా రాబోతుంది. ఈ విషయంలో అభిమానులు ఆనందంగా ఉన్నారు. చిరంజీవి 157వ సినిమా మొదలు కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. చిరంజీవి 156 సినిమానే మొదలవ్వలేదు. అంటే, చిరంజీవి 157 మొదలయ్యేది వచ్చే సంవత్సరమేనని అర్థమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూవీ క్రియేషన్స్ ట్వీట్