Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి -అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో పూర్తిగా బిజీగా ఉన్నారు.
నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉండగా, గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యమవ్వడంతో వేసవికి వాయిదా పడింది.
త్వరలోనే 'విశ్వంభర' కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు తర్వాత చిరంజీవి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ ఊరమాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రం న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందనుండటంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
వివరాలు
జనవరి 15న పూజా కార్యక్రమం
అదే విధంగా చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ అనిల్ రావిపూడితో ఉండనుంది.
అనిల్ ప్రస్తుతం రూపొందించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న విడుదల కానుంది.
ఈ క్రమంలో చిరంజీవి సినిమా సంక్రాంతి ప్రత్యేక కానుకగా అధికారికంగా జనవరి 15న ప్రారంభం కానుందనే సమాచారం అందుతోంది.
సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఈ సినిమా షైన్‌స్క్రీన్స్ సంస్థ నిర్మించనుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
వివరాలు
చిరంజీవిని మరో విధంగా చూపించబోతున్నాను: అనిల్
ఇక ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో అలా ప్రెజెంట్ చేస్తానని పేర్కొన్నారు.
శ్రీకాంత్ ఓదెల ఒక విధంగా చూపిస్తే, తాను చిరంజీవిని మరో విధంగా చూపించబోతున్నానని, ఎట్టకేలకు ప్రేక్షకులను మెప్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి ఏ విధమైన సినిమా చేస్తాడో చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.