
డబ్బింగ్ పనుల్లో బోళా శంకర్ బిజీబిజీ.. హిందీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో భోళా శంకర్ కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఈ మేరకు ఆగస్ట్ 25న బాలీవుడ్ లో మరోసారి చిరంజీవి సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆగస్ట్ 11న థియేటర్లో విడుదలైన భోళా శంకర్ ఆశించిన మేర కలెక్షన్లను సాధించలేపోయింది. ఈ మేరకు సినీ అభిమానులని, ప్రేక్షకులని తీవ్రంగా నిరాశపరిచింది.
భోళా శంకర్ విడుదలైన తొలి నాలుగు రోజుల్లో కేవలం 50 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కేవలం రూ. 25 కోట్ల వసూళ్లను మాత్రమే పొందింది.
ఈ కారణంగానే ప్రస్తుతం హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
DETAILS
భోళా శంకర్ హిందీ హక్కులను కొనుగోలు చేసిన ఆర్కేడీ స్టూడియోస్
భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, ఛార్మింగ్ హీరోయిన్ కీర్తి సురేష్,అక్కినేని వారసుడు సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
బిల్లా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ వేదాళంకి రీమేక్. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర నిర్మాతగా భోళా శంకర్ చిత్రీకరణ జరిగింది.
తమిళ స్టార్ హీరో అజిత్, వేదాళం చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. తెలుగు స్థానికత మేరకు కథాంశంలో మార్పులు చేసినా ఆశించిన ఫలితం దక్కకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే భోళా శంకర్ హిందీ డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంటోంది.ఆగస్ట్ 25న రిలీజ్ చేయబోతన్న ఈ చిత్ర హక్కులను RKD స్టూడియోస్ కోనుగోలు చేసింది.