భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు దర్శకత్వం: మెహెర్ రమేష్ సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాణం: ఏకే ఎంటర్ టైన్మెంట్స్ కథ: చెల్లెలు మహాలక్ష్మి(కీర్తి సురేష్) చదువు కోసం శంకర్ (చిరంజీవి) కోల్ కతాకు వస్తాడు. చెల్లెల్ని కాలేజీలో చేర్పించి జీవనాధారం కోసం ట్యాక్సీ డ్రైవర్ గా మారతాడు. అయితే నగరంలో వరుసగా అమ్మాయిలు మిస్సవుతుంటారు. ఈ కేసును ఛేధించడానికి పోలీసులు, ట్యాక్సీ డ్రైవర్ల హెల్ప్ తీసుకుంటారు. అలా శంకర్ సాయం తీసుకోవడంతో అతనికి చిక్కులు ఎదురవుతాయి. ఆ చిక్కులను అతడు ఎలా తట్టుకున్నాడు? ఎలా బయటపడ్డాడు? అసలు శంకర్ గతం ఏమిటనేదే కథ.
సినిమా ఎలా ఉంది?
సినిమాలో చిరంజీవి గెటప్ బాగుంది. ప్రతీ సీన్ లోనూ చాలా కొత్తగా కనిపించారు. చిరంజీవి లుక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. అయితే ప్రథమార్థం బాగా స్లోగా సాగుతుంది. షో మొదలవ్వగానే అమ్మాయిలు మిస్సవడం, ఆ కేసును ఛేధించడానికి శంకర్ సాయం చేయడానికి చకచకా జరిగిపోతాయి. ఇంటర్వెల్ సీన్ ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు సెకండాఫ్ లో ఉన్నాయి. చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య బంధాన్ని బాగా చూపించారు. తమన్నా గ్లామర్ సరిపోయింది గానీ సొంత డబ్బింగ్ ఇబ్బంది పెట్టింది. జబర్దస్త్ యాక్టర్స్ ఎక్కువ మంది కనిపించినా పంచులు సరిగ్గా పేలలేదనే చెప్పాలి.
ఎవరెలా చేసారు?
మెగాస్టార్ చిరంజీవి ఎప్పటిలానే తన పరిధిలో తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సినిమాలో ఆయన లుక్స్ బాగున్నాయి. కీర్తి సురేష్ తన పాత్రలో ఆకట్టుకుంది. తమన్నా, సుశాంత్ తమ పాత్రల పరిధుల మేరకు చేసారు. విలన్ పాత్రను సీరియస్ గా తీర్చిద్దలేదేమో అనిపించింది. శ్రీముఖి స్కోప్ ఉన్న పాత్ర పడింది. జబర్దస్త్ యాక్టర్స్ ఉన్నా కూడా గుర్తుండిపోయేలా సీన్లు పడలేదు. నేపథ్య సంగీతం అక్కడక్కడా బాగున్నట్టు, కొన్నిచోట్ల మరింత బాగుంటే సీన్ ఇంకా ఎలివేట్ అయ్యుండేదన్నట్లు అనిపించింది. మొత్తంగా చూసుకుంటే భోళాశంకర్ సినిమా మెగాస్టార్ అభిమానులను అలరిస్తుంది.