Loading...
Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవి మాత్రమే చేసిన ఒరిజినల్ స్టంట్స్ 'Kick-up'
ఫైట్స్ లో చిరంజీవి మాత్రమే చేసిన ఒరిజినల్ స్టంట్స్ 'Kick-up'

Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవి మాత్రమే చేసిన ఒరిజినల్ స్టంట్స్ 'Kick-up'

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాలో హీరో అంటే కేవలం డైలాగ్స్ చెప్పడం, నటించడం మాత్రమే కాదు. యాక్షన్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాల్లోనూ మెప్పించాల్సిందే. అప్పుడే ప్రేక్షకులు హీరోను పూర్తిస్థాయిలో యాక్సెప్ట్ చేస్తారు. అందుకే హీరోగా రాణించాలనుకునేవారు అన్ని విభాగాల్లోనూ మంచి పట్టు సాధించాల్సి ఉంటుంది. చిత్తూరు నాగయ్య నుంచి నేటి తరం హీరోల వరకు ఇదే విధానం కొనసాగుతోంది. అయితే కొంతమంది హీరోల్లో మాత్రం ప్రత్యేకమైన 'హీరో మెటీరియల్' ఉంటుంది. అంటే.. డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా ఏదో ఒక అంశంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రేక్షకులను ప్రభావితం చేసిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.

వివరాలు

భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి..

'శివాజీ గణేశన్ + రజినీకాంత్ + కమల్ హాసన్ = చిరంజీవి' అంటూ తమిళ దిగ్గజ దర్శకుడు దివంగత కె. బాలచందర్ దశాబ్దాల క్రితమే చిరంజీవిని అభివర్ణించారు.

ఆయన అలా ఊరికే చెప్పలేదు. చిరంజీవిలోని ప్రతిభ, విభిన్నమైన ప్రత్యేకతలు ఆయనకు అలాంటి మాట చెప్పేలా చేశాయి.

ఇప్పటికీ సినిమా కోసం చిరంజీవి పడుతున్న కష్టం చూస్తే.. ఆయన గురించి బాలచందర్ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో అర్థమవుతుంది.

వీటన్నింటికీ తోడు ఫైట్స్‌లో ఆయన చేసే ఓ ప్రత్యేకమైన ఫ్లిప్ మూమెంట్ కూడా ఉంది.

అదే 'కిక్-అప్'. భారతీయ సినిమా చరిత్రలో స్టార్ హీరో స్థాయిలో ఉన్న ఓ నటుడు ఇలాంటి స్టంట్‌ను స్వయంగా చేయడం చాలా అరుదనే చెప్పాలి.

వివరాలు

ఆయన ప్రత్యేకత అదే..

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న హీరోలు ఇలాంటి ఫ్లిప్స్ చేసి ఉండొచ్చు. కానీ చిరంజీవి చేసిన 'కిక్-అప్' మాత్రం ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండా స్వయంకృషితో నేర్చుకున్న స్టంట్‌గా చెబుతారు.

తన కెరీర్‌లో 15కుపైగా సినిమాల్లో చిరంజీవి ఇలాంటి బాడీ ఫ్లిప్ మూమెంట్స్ చేశారు.

'బిల్లా రంగా' సినిమాలో చిరంజీవి చేసిన ఓ ఫ్లిప్ అయితే ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటుంది.

భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి తప్ప మరే హీరో ఇలాంటి స్టంట్ చేయలేదనే అభిమానులు చెబుతుంటారు.

అందుకే చిరంజీవి అంటే కేవలం ఓ హీరో కాదు.. ఓ ఇన్‌స్పిరేషన్. ఎంతోమంది హీరోలు వచ్చారు.. వస్తున్నారు. కానీ చిరంజీవిగా మాత్రం ఎవరూ మారలేరనేది ఆయన ప్రత్యేకతకు నిదర్శనం.

ADVERTISEMENT