
Chiranjeevi:లండన్‌లో ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు.. చిరంజీవి ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)ని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ - యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు.
ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. అయితే, ఈ సందర్భంగా చిరంజీవి లండన్ పర్యటనను కొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేశారు.
ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు యత్నించారు.
ఈ విషయం చిరంజీవికి తెలియగానే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన ఎక్స్ వేదికగా స్పష్టమైన సందేశాన్ని పంపించారు.
వివరాలు
చిరంజీవి స్పందన
"ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలుసుకునేందుకు మీరు చూపిన ప్రేమ, అభిమానానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే, ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి దుష్టచర్యలను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. దీనిని ఖండిస్తున్నాను. ఎవరైనా ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారిని ఖండించి, మీ డబ్బును తిరిగి పొందండి. ఇటువంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండండి. నా అభిమానుల ప్రేమ విలువకు ఏదీ సమానం కాదు. మన మధ్య ఉన్న అనుబంధాన్ని స్వచ్చమైనదిగా, స్వార్థరహితంగా ఉంచుకుందాం." - చిరంజీవి (ఎక్స్ వేదికగా)
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవి చేసిన ట్వీట్
My Dear Fans , I am deeply touched by all your love and affection in wanting to meet me in UK. However, I’ve been informed that some individuals are attempting to charge a fee for the fan meetings. I strongly condemned this behaviour. Any fee collected by any one will be refunded…
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025
వివరాలు
సినిమా అప్‌డేట్స్
ప్రస్తుతం చిరంజీవి,వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్ 'విశ్వంభర' (Vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు.
త్రిష కథానాయికగా నటిస్తుండగా,ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.విజువల్ ఎఫెక్ట్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.
కానీ,క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా,అన్ని పనులు పూర్తయిన తర్వాతనే విడుదల తేదీ ఖరారు చేయాలని భావిస్తున్నారు.
అలాగే, చిరంజీవి త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు.
ఇప్పటికే కథ ఓకే కాగా, స్క్రిప్ట్ పై ఫైనల్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ అనంతరం, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి నటించనున్నారు.