Loading...
Chiranjeevi Venky Kudumula: వెంకి కుడుములపై చిరు జోక్స్‌...ఎన్నటికీ తీయను
వెంకి కుడుములపై చిరు జోక్స్‌...ఎన్నటికీ తీయను

Chiranjeevi Venky Kudumula: వెంకి కుడుములపై చిరు జోక్స్‌...ఎన్నటికీ తీయను

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త హీరో అనీశ్‌ రెడ్డి నటించిన 'ఇట్లు అర్జున' సినిమా సక్సెస్‌ మీట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చేసిన సరదా వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెంకీ కుడుములపై ఆయన వేసిన పంచ్‌లు సభలో నవ్వులు పూయించాయి. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనస్వర రాజన్‌ కథానాయికగా నటించారు. అక్కినేని నాగార్జున సమర్పణలో, వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 13న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Details

కథతో వస్తానన్నాడు.. నిర్మాతగా మారిపోయాడు!

వేదికపై వెంకీ కుడుముల గురించి మాట్లాడిన చిరంజీవి ఆయన కామెడీ టైమింగ్‌ను ప్రశంసిస్తూనే సరదాగా ఆటపట్టించారు.

వెంకీ సినిమాలు తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కలిసి పనిచేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ''నేను ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు.

కానీ ఈ దుర్మార్గుడిని మాత్రం అడిగాను. మంచి కథతో వస్తాను సర్ అన్నాడు. అప్పటి నుంచి ఎదురుచూస్తున్నాను.

చివరికి నాకు హ్యాండ్ ఇచ్చాడు'' అంటూ నవ్వించారు. కథతో వస్తానన్న వెంకీ, చివరకు నిర్మాతగా మారి యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడని చురకలేశారు.

Details

నా ఇంటి గేట్లు మూసేస్తా.. చిరు సరదా వార్నింగ్‌!

వెంకీ కుడుముల తనతో సినిమా చేయకుండా ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నాడని చెబుతూ.. ''ఇకపై వెంకీ వచ్చినా నా ఇంటి గేట్లు మూసి ఉంటాయి'' అని చిరంజీవి చమత్కరించారు.

దీనికి వెంకీ కూడా అదే స్థాయిలో స్పందించారు. ''మీరు తలుపులు మూసేసినా, నేను దూకి వచ్చి మీకు కథ వినిపిస్తా'' అంటూ నవ్వులు పూయించారు.

ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ వేడుకలో హైలైట్‌గా నిలిచింది.

ADVERTISEMENT

Details

కొత్త హీరో అనీశ్‌పై చిరంజీవి ప్రశంసలు

ఈ సందర్భంగా హీరో అనీశ్‌ రెడ్డిని కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.

సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన నటుడికి నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖుల మద్దతు లభించడం అరుదైన విషయమని, ఆ విషయంలో అనీశ్‌ అదృష్టవంతుడని పేర్కొన్నారు.

ప్రస్తుతం 'ఇట్లు అర్జున' సక్సెస్‌ మీట్‌లో చిరంజీవి, వెంకీ కుడుముల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ADVERTISEMENT