LOADING...
Chirnajeevi: 'నా విజయం వెనుక నువ్వే': భార్య సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
'నా విజయం వెనుక నువ్వే': భార్య సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chirnajeevi: 'నా విజయం వెనుక నువ్వే': భార్య సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం తన భార్య సురేఖేనని అగ్ర కథానాయకుడు చిరంజీవి వెల్లడించారు. సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరు తన ఎక్స్ (X) ఖాతాలో కొన్ని ఫొటోలు పంచుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

వివరాలు 

నా విజయ రహస్యం ఏంటని ఎవరైనా అడిగితే..

"నా జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులోనూ నా వెంట నడిచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు. 1980 ఫిబ్రవరి 20న మన వివాహం జరిగిన నాటి నుంచి నువ్వే నాకు అండగా నిలిచావు.నీ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే మన వివాహ వార్షికోత్సవం రావడం మరింత ఆనందంగా ఉంది.నీ ప్రేమ, ఆప్యాయతలతో కుటుంబాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నావు.నా తల్లిని సొంత బిడ్డలా చూసుకుంటావు. నా విజయ రహస్యం ఏంటని ఎవరైనా అడిగితే..నా ప్రతిభా,కృషి కాదు..నువ్వే అని చెప్పుతాను.నువ్వు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నావు కాబట్టే నేను నటనపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను.కష్టసుఖాల్లో మమ్మల్ని ఒకే దారిలో నడిపించావు. నీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను"అంటూ చిరంజీవి తన ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి చేసిన ట్వీట్ 

Advertisement

వివరాలు 

జూలై 9న ప్రేక్షకుల ముందుకు విశ్వంభర

ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే 'మనశంకర వరప్రసాద్‌ గారు'తో సూపర్‌ హిట్‌ను అందుకున్న చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement