LOADING...
Izzat Song : సుమ కొడుకు సినిమా సాంగ్‌ని లాంచ్ చేసిన చిరంజీవి
సుమ కొడుకు సినిమా సాంగ్‌ని లాంచ్ చేసిన చిరంజీవి

Izzat Song : సుమ కొడుకు సినిమా సాంగ్‌ని లాంచ్ చేసిన చిరంజీవి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో యాంకర్ లిస్ట్‌లో నెంబర్ స్థానంలో ఉన్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇప్పటికే టాప్ యాంకర్ గానే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు తన కొడుకు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా 'బబుల్ గమ్'. కృష్ణ అండ్ హిస్ లీలీ, క్షణం లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 29న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ పాటను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లాంచ్ చేశాడు.

Details

ఇజ్జత్ సాంగ్ లో ఎనర్జిటిక్ గా కనిపించిన రోషన్ కనకాల

ఇజ్జత్ అంటూ సాగే ఈ పాటలో మంచి ఎనర్జిటిక్‌గా రోషన్ కనిపిస్తున్నాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్‌ని శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేయగా, హరి లిరిక్స్ రాసి పాట పాడారు. తెలంగాణ, హైదరాబాద్ యూత్ స్టైల్‌లో ఉన్న ఈ సాంగ్‌లో రోషన్స్ చాలా చక్కగా డాన్స్ చేశారు. మరి ఈ సినిమా రోషన్‌కి హీరోగా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో వేచి చూడాలి.