Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. మెగాస్టార్ చిరంజీవి తనదైన మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌తో సినిమాను తెరకెక్కించడంతో, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి అనుభూతిని అందించింది. ఫలితంగా ఈ చిత్రం 'రీజనల్ ఇండస్ట్రీ హిట్'గా నిలిచి, భారీ వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో విజయవంతమైన రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Details
జీ5లో స్ట్రీమింగ్
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5) దక్కించుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని జీ5 ప్లాన్ చేస్తోందని సమాచారం. తెలుగు భాషతో పాటు ఇతర పాన్ ఇండియా భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, నయనతాన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, వెంకటేష్ (వెంకీ మామ) ఇచ్చిన సాలిడ్ కామియో థియేటర్లలో విజిల్స్‌కు కారణమైంది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ వేదికపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.