Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు-ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమా 'దసరా'తోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో 'ది ప్యారడైజ్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. అయితే 'ది ప్యారడైజ్' పనుల్లో శ్రీకాంత్ ఓదెల బిజీగా ఉండటంతో చిరంజీవి సినిమా ఆలస్యమవుతోందని ప్రచారం జరిగింది. అంతేకాదు.. చివరకు ఈ ప్రాజెక్ట్‌నే ఆపేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను క్యాన్సిల్ చేశారంటూ పుకార్లు కూడా వినిపించాయి.
వివరాలు
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ మెగా ప్రాజెక్ట్..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లు తెలుస్తోంది.
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ ఓదెల.. ఆయనతో సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్ చేశారు.
దీంతో చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల సినిమా ఆగిపోలేదనే విషయం స్పష్టమైనట్లయింది.
ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఓదెల.. ఆ మూవీ పూర్తయిన తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.
గతంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్ట్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది.
వివరాలు
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా..
1970ల నేపథ్యంలో, ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రూపొందనున్నట్లు సమాచారం.
గతంలో విడుదలైన ఈ సినిమా లుక్స్‌లో చిరంజీవి చేతులకు రక్తం కనిపించింది.
దీంతో ఈ మూవీ రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కనుందనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మెగా మూవీని న్యాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు.
వివరాలు
సరైన సమయంలో సెట్స్‌పైకి..
'దసరా' సినిమాలో తన రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో ఆకట్టుకున్న శ్రీకాంత్ ఓదెల.. 'ది ప్యారడైజ్' తర్వాత మెగాస్టార్ చిరంజీవిని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆగిపోలేదని, సరైన సమయంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తాజా పోస్ట్‌తో మరోసారి క్లారిటీ వచ్చినట్లే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
Happy Birthday, “T-REX” Megastar Chiranjeevi Sir ❤️
— Srikanth Odela (@odela_srikanth) August 22, 2026
Waiting eagerly to start our film’s shoot and create a lifetime of unforgettable memories with you, Boss Sir ❤️@KChiruTweets sir 🤗❤️ pic.twitter.com/MhxiC3DqYk