Megastar Chiranjeevi: ఆయన ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక పాఠం!
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు ఆఫీసులో ఓ ఫ్రెండ్‌తో AI గురించి మాట్లాడుతున్నాను. అతను AIని బాగా ఉపయోగిస్తున్నాడు. సరదాగా నేను ఓ ప్రశ్న అడిగాను.. "అలా AI వాడుతున్నావ్.. టోకెన్లు అయిపోతే?" వెంటనే అతను నవ్వుతూ.. "అవేమైనా చిరంజీవి సినిమా టికెట్లా.. అయిపోవడానికి?" అన్నాడు. ఆ మాట విని నేనూ నవ్వుకున్నా. కానీ కాసేపటి తర్వాత ఆలోచిస్తే ఓ విషయం అర్థమైంది. మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా.. ఎక్కడో ఒకచోట మన రిఫరెన్స్ చిరంజీవి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది.
వివరాలు
ఆయన డ్యాన్స్ స్టైలే వేరు..
చిన్నప్పుడు కొత్త జీన్స్, స్టైలిష్ షర్ట్ వేసుకుని వస్తే.. "ఏరా.. చిరంజీవిలా ఉన్నావ్!" అని అంటారు.
కొంచెం కోపం చూపిస్తే.. "ఏంటి.. ఇప్పుడు చిరంజీవిలా కొడతావా?" అంటారు.
కాస్త స్టైల్ చూపిస్తే.. "వీడో చిరంజీవి మరి!" అని ఆటపట్టిస్తారు. డ్యాన్స్ బాగా చేస్తే.. "బాగానే వేశావ్.. కానీ చిరంజీవిలా లేదబ్బాయ్" అంటారు.
బద్ధకంగా ఉంటే మాత్రం.. "చిరంజీవిని చూసి నేర్చుకోండ్రా.. ఎంత కష్టపడతాడో!" అని చెబుతారు.
కాలం మారింది. మన వయసు పెరిగింది. మన సమస్యలు మారాయి.
మన సంభాషణలు కూడా మారాయి. కానీ రిఫరెన్స్ మాత్రం మారలేదు. "మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి రా.." అంటే.. "చిరంజీవిని చూడు.. ఇప్పటికీ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో!" అంటారు.
వివరాలు
రిఫరెన్స్ మాత్రం ఆయన దగ్గరనుంచే..
"వెయిట్ పెరిగిపోతున్నా.." అంటే.. "మీ చిరంజీవిని చూడు.. ఎలా మెయింటెయిన్ చేస్తున్నాడో!" అని చెబుతారు.
"ఏంటో రా.. లైఫ్ బోర్ కొట్టేసింది. ఇంకేం చేయాలనిపించడం లేదు" అంటే.. "అరే.. ఆయనను చూడు.
ఇప్పటికీ ఇంకా ఏదో చేయాలి.. ఇంకా ఏదో సాధించాలి అనే తపనతోనే ఉన్నాడు. మనం ఎంత?" అని ప్రశ్నిస్తారు.
థియేటర్ ముందు టికెట్ క్యూ నుంచి.. ఇప్పుడు ఏఐ టోకెన్ల వరకు వచ్చేశాం. ప్రపంచం మారింది.
టెక్నాలజీ మారింది. తరాలు మారాయి. కానీ మన రిఫరెన్స్ మాత్రం చిరంజీవి దగ్గరే ఆగిపోయింది.
వివరాలు
ఆయనదొక గొప్ప ప్రయాణం..
ఇన్ని దశాబ్దాలుగా ఈ రిఫరెన్స్ ఇంత కంటిన్యూగా కొనసాగుతుందంటే.. దాని వెనుక ఓ గొప్ప ప్రయాణం ఉంది.
ఓ తపస్సు ఉంది. ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ఎన్నో విమర్శలు ఉన్నాయి.
వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు వచ్చిన ఓ జీవితం ఉంది. అయితే ఈ ప్రయాణం మనకు చెప్పే అసలు పాఠం ఇంకొకటి. మన జీవితాల్లో కూడా హైస్ ఉంటాయి.. లోస్ ఉంటాయి.
ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే.. "నీ వల్ల కాదు" అని ఎవరో ఒకరు అంటారు. మన ప్రయత్నాన్ని చూసి ఇంకొకరు నవ్వుతారు.
మనల్ని నిరుత్సాహపరిచే వ్యక్తి రిలేటివ్ కావచ్చు.. టీచర్ కావచ్చు.. ఫ్రెండ్ కావచ్చు.. కొలీగ్ కావచ్చు.
వివరాలు
ప్రతి విమర్శకూ వెంటనే సమాధానం..
ప్రతి మాటకూ బాధపడొచ్చు. ప్రతి విమర్శకూ వెంటనే సమాధానం చెప్పాలనిపించొచ్చు.
కానీ చిరంజీవి ప్రయాణం మనకు నేర్పే పాఠం మాత్రం వేరు. నీ మీద వచ్చిన విమర్శలకు నీ మాటలతో కాదు.. నీ కష్టంతో సమాధానం చెప్పు.
ఎందుకంటే చివరికి కాలం గుర్తుపెట్టుకునేది ఎవరు ఎవరిని ఏమన్నారు అనేది కాదు.
నువ్వు ఏం చేశావు? ఎంత కష్టపడ్డావు? ఏం సాధించావు? అన్నదే. నీ సమాధానం నీ ఫలితంలో ఉండాలి.
ట్విట్టర్‌లో 140 అక్షరాల్లో కాదు. మాటకు ఇంకో మాట చెప్పొచ్చు. కానీ ఫలితం వచ్చిన రోజు.. చాలా మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండదు.
వివరాలు
హ్యాపీ బర్త్‌డే బాస్!
అందుకేనేమో.. "చిరంజీవి" అనే పేరు ఓ సెల్ఫ్-హెల్ప్ బుక్‌లాంటిది.
మన ముందున్న అడ్డంకులను ఎలా దాటాలో చెప్పే ఓ వర్చువల్ క్లాస్‌రూమ్.
జీవితంలో ఎక్కడైనా స్టక్ అయినప్పుడు.. "ఇలా కూడా ముందుకు వెళ్లొచ్చు" అని దారి చూపించే ఓ కంపాస్.
మన మాటల్లో ఓ రిఫరెన్స్. మన ప్రయత్నాల్లో ఓ ఇన్‌స్పిరేషన్. మన కష్టాల్లో ఓ లెసన్.
మన నమ్మకంలో ఓ ధైర్యం. అందుకే ఆయన కష్టజీవి.. అందరికీ ఇష్టజీవి.. మన మెగాస్టార్ చిరంజీవి!
నేడు ఆయన పుట్టినరోజు కావచ్చు.. కానీ సంబరాలు మాత్రం ఈ నెలంతా.. అభిమానులు మాత్రం ఈ నేలంతా..
హ్యాపీ బర్త్‌డే బాస్!