LOADING...
Chiranjeevi: రాష్ట్ర స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన.. చిరు స్పెషల్‌ పోస్ట్‌
రాష్ట్ర స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన.. చిరు స్పెషల్‌ పోస్ట్‌

Chiranjeevi: రాష్ట్ర స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన.. చిరు స్పెషల్‌ పోస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కామినేని నియామకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆమె మామ, సినీ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ పెట్టారు.

వివరాలు 

దేవుడి ఆశీస్సులు నీతో ఎల్లప్పుడూ ఉండుగాక: చిరంజీవి 

''మా కోడలు ఉపాసన ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ కో-ఛైర్‌పర్సన్‌ పదవిలో నియమితులైంది. ఇది మాకు ఎంతో గర్వకారణం. ఈ పదవి గౌరవంగా ఉన్నప్పటికీ, బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను. డియర్‌ ఉపాసన.. నీకున్న నిబద్ధత, క్రీడల పట్ల నీ ఆసక్తి నీను ఎంతో ముందు తీసుకెళ్తాయని నమ్ముతున్నాను. రాబోయే రోజుల్లో క్రీడలలో దాగి ఉన్న యువత ప్రతిభను వెలికి తీసి, వారిని అగ్రస్థానానికి తీసుకెళ్లే విధంగా పాలసీలు రూపొందించడంలో నీవు కీలకపాత్ర పోషిస్తావని ఆశిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు నీతో ఎల్లప్పుడూ ఉండుగాక'' అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి చేసిన ట్వీట్ 

వివరాలు 

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు 

తనను స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా నియమించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యత తనకు ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చిందని ఆమె తెలిపారు. దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడం కూడా ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.