Page Loader
Jani Master :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు 
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు

Jani Master :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ముంబైలోని ఓ హోటల్‌లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, ఆ విషయం బయటకు చెప్పవద్దని బెదిరించడమే కాకుండా, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేశాడని, ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. జానీ మాస్టర్ దిల్లీలో జాతీయ అవార్డును అందుకోవాల్సిన నేపథ్యంలో రంగారెడ్డి ఫోక్సోకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

వివరాలు 

సెప్టెంబర్ 15న జానీపై FIR నమోదు

కోర్టు ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ లైంగిక వేధింపుల కేసు కారణంగా జానీ మాస్టర్‌కు ఇవ్వవలసిన జాతీయ అవార్డును రద్దు చేయడంతో ఆయన బెయిల్ కూడా రద్దైంది. తాను కూడా మధ్యంతర బెయిల్ అవసరం లేదంటూ జానీ మాస్టర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 15న జానీపై FIR నమోదు కాగా, సెప్టెంబర్ 19న ఆయన అరెస్ట్ అయ్యారు. మొత్తం 35 రోజులు జైల్లో గడిపిన జానీ మాస్టర్ ఇప్పుడు బెయిల్ మంజూరవడంతో చంచల్ గూడా జైలులో నుంచి విడుదల కానున్నారు.