
Ajith: సినిమా vs రేసింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్
ఈ వార్తాకథనం ఏంటి
తన సినీ ప్రయాణంతో పాటు రేసింగ్ ప్రపంచంలోనూ అగ్రస్థానానికి చేరిన నటుడు అజిత్ కుమార్ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇటీవలే విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం విజయవంతంగా ఆడుతోంది. ఇదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన రాబోయే ప్రాజెక్ట్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు రేసింగ్‌పై ఉన్న ప్రేమను, ఆరోగ్యంపై తీసుకున్న కృషిని వివరించారు. రేసింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ ఇది ఫిట్‌నెస్ డిమాండ్ చేసే క్రీడ.
అందుకే గత ఎనిమిది నెలల్లో స్విమ్మింగ్, సైక్లింగ్, డైట్‌తో పాటుగా పలు వ్యాయామాలు చేయడం ద్వారా సుమారు 42 కిలోల బరువు తగ్గానని అజిత్ తెలిపారు.
Details
రెండింటికి న్యాయం చేయలేకపోతున్నా
సినిమా, రేసింగ్ రెండింటినీ ఒకేసారి చేయాలనుకున్నా, రెండింటికీ సమంగా న్యాయం చేయలేకపోతున్నానని చెప్పిన ఆయన, రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు స్వల్ప విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
నా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు నేనే చేస్తాను. దీని వలన అనేక సర్జరీలు కూడా అయ్యాయి.
కానీ అలా అని యాక్షన్ సినిమాలను వదిలేయలేను. అదేవిధంగా ప్రమాదాలున్నా రేసింగ్‌కి దూరం కావడం నా వల్ల కాదు. ఈ రెండూ నా జీవితంలో ముఖ్యమైన భాగాలని అజిత్ వివరించారు.
Details
రేసింగ్ లోనూ రాణిస్తున్న అజిత్
తన తదుపరి సినిమా నవంబర్‌లో ప్రారంభమవుతుందని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే, ఇటీవల అజిత్ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
రేసింగ్ రంగంలోనూ రాణిస్తున్నారు. జనవరిలో జరిగిన 24 గంటల దుబాయ్ కారు రేసులో మూడో స్థానం, ఇటలీలోని 12 గంటల రేసులో మూడో స్థానం,
అలాగే బెల్జియంలోని స్పా-ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్ సర్క్యూట్‌లో ద్వితీయ స్థానం సాధించారు.