Page Loader
Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది
ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది

Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌ - దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పించనున్నారని, నితిన్‌ కక్కర్‌ దర్శకత్వంలో, ఎస్‌.ఎస్‌. కార్తికేయ, వరుణ్‌ గుప్తా నిర్మాణంలో రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తెలుగు స్టార్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో, బాలీవుడ్‌లోనూ ఆమిర్‌ ఖాన్‌ - రాజ్‌కుమార్‌ హిరాణీ కాంబినేషన్‌లో ఈ బయోపిక్‌ రూపొందుతోందని జోరుగా వినిపిస్తోంది.

Details

ఫాల్కేపై సినిమా తీయాలంటే కుటుంబసభ్యులతో మాట్లాడాలి

ఈ నేపథ్యంలో దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, "రాజమౌళి సమర్పణలో బయోపిక్‌ రాబోతుందన్న వార్తలు నాన్చుతున్నాయి. కానీ ఆయన గానీ, ఆయన టీమ్‌ గానీ నన్ను ఇప్పటివరకు సంప్రదించలేదు. ఫాల్కేపై సినిమా తీయాలంటే కుటుంబసభ్యులతో కనీసం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన జీవితానికి సంబంధించిన వివరాలు మాకు స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు.

Details

అమీర్ ఖాన్ నటించడం చాలా సంతోషంగా ఉంది

అయితే, బాలీవుడ్‌ ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ - ఆమిర్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ బృందం తమతో ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. "వాళ్ల అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ నాతో మూడు సంవత్సరాలుగా టచ్‌లో ఉన్నారు. వందల సార్లు కలిశారు, వివరాలు సేకరించారు. వాళ్లు నిజాయితీగా పనిచేస్తున్నారు. వాళ్లపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, "దాదాసాహెబ్‌ ఫాల్కే పాత్రలో ఆమీర్‌ ఖాన్‌ నటించడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, అత్యంత నిబద్ధతతో పని చేసే వ్యక్తి, అని కొనియాడారు.