Loading...
Suriya Political Entry: సూర్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. విజయ్‌లా రాజకీయాల్లోకి వస్తారా?
సూర్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. విజయ్‌లా రాజకీయాల్లోకి వస్తారా?

Suriya Political Entry: సూర్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. విజయ్‌లా రాజకీయాల్లోకి వస్తారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లోకి నటుడు విజయ్ ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో.. మరో స్టార్ హీరో సూర్య రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మొదలైంది. ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారా? విజయ్ బాటలోనే నడుస్తారా? అంటూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రశ్నలపై సూర్య స్వయంగా స్పందించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

వివరాలు

రాజకీయాలపై సూర్య ఏమన్నారంటే?

చెన్నైలో జరిగిన తన తాజా చిత్రం 'సీన్' విజయోత్సవ కార్యక్రమంలో సూర్య రాజకీయ ప్రవేశంపై మాట్లాడారు.

ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడం లేదని చెబుతూనే.. రాజకీయాలంటే తనకు ద్వేషం లేదని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు.

రాజకీయాలపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు.. ఆ రంగంలోని బాధ్యతలను తెలుసుకోకుండా అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు.

వివరాలు

అగరం ఫౌండేషన్ సేవలతో చర్చ

సూర్య రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆయన నిర్వహిస్తున్న 'అగరం ఫౌండేషన్' సేవా కార్యక్రమాలు ఈ చర్చకు కారణమయ్యాయి.

అయితే తాజాగా సూర్య చేసిన వ్యాఖ్యలతో ఇప్పట్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టమైంది.

మరోవైపు సూర్య నటించిన 'సీన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో నజ్రియా నజీమ్, మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు.

నవంబర్ 6న విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

ADVERTISEMENT