Loading...
Nani-CM Reply: 'ది పారడైజ్' ప్రీమియర్‌కు నాని స్పెషల్ రిక్వెస్ట్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?
'ది పారడైజ్' ప్రీమియర్‌కు నాని స్పెషల్ రిక్వెస్ట్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

Nani-CM Reply: 'ది పారడైజ్' ప్రీమియర్‌కు నాని స్పెషల్ రిక్వెస్ట్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది పారడైజ్' సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు ఒక రోజు ముందే, సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమాను చూడాలని నాని కోరారు. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో విజ్ఞప్తి చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాని చేసిన ట్వీట్ 

వివరాలు 

ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలన్న నాని

సినిమా అంటే చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఇష్టమని నాని తెలిపారు.

ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించడంలోనే తనకు ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని చెప్పారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ప్రత్యేక అనుభవమని పేర్కొన్నారు.

'ది పారడైజ్' ప్రీమియర్ షో సందర్భంగా సెప్టెంబర్ 23న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందని నాని తన పోస్టులో వెల్లడించారు.

తాము సినిమా తీసేది ప్రేక్షకుల కోసమేనని, అదే ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే నటుడిగా అసలైన సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ

తన విజ్ఞప్తిని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను నాని కోరారు.

తాను, తన బృందం థియేటర్‌కు వచ్చే సమయంలో అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.

ప్రేక్షకుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ స్పందన

నాని చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ వ్యవహరించాలని సూచించడంతో పాటు,తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'ది పారడైజ్' సినిమాపై నాని చూపిస్తున్న నిబద్ధతను అభినందించారు.

అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు అధికారిక ప్రక్రియను అనుసరించాలని సీఎం సూచించారు.

రద్దీని నియంత్రించడం,ప్రేక్షకులు,ప్రజల భద్రతను నిర్ధారించడం కోసం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నాని సమర్పించే దరఖాస్తును సంబంధిత పోలీసు అధికారులు పరిశీలించి, భద్రతా పరిస్థితులు,రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారని సీఎం స్పష్టం చేశారు.

ఈ మేరకు తెలంగాణ డీజీపీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్యాగ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నానికి రేవంత్ రెడ్డి రిప్లై 

వివరాలు 

సెప్టెంబర్ 24న 'ది పారడైజ్' విడుదల

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది పారడైజ్'లో నాని ప్రధాన పాత్రలో నటించారు.

సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు, సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు చిత్రబృందం సిద్ధమైంది.

మొత్తంగా, ప్రేక్షకుల మధ్య కూర్చొని తన సినిమా స్పందనను ప్రత్యక్షంగా ఆస్వాదించాలన్న నాని కోరిక ఇప్పుడు అధికారిక అనుమతుల ప్రక్రియకు చేరింది.

పోలీసుల పరిశీలన అనంతరం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాని ప్రీమియర్ షోకు హాజరవుతారా లేదా అన్నది తేలనుంది.

ADVERTISEMENT