LOADING...
Bigg Boss 9 : కాంట్రవర్సీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి.. ఆ స్టేజ్‌పై రచ్చ గ్యారంటీ!
కాంట్రవర్సీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి.. ఆ స్టేజ్‌పై రచ్చ గ్యారంటీ!

Bigg Boss 9 : కాంట్రవర్సీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి.. ఆ స్టేజ్‌పై రచ్చ గ్యారంటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో బిగ్ బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సారి సాధారణ వ్యక్తులను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'అగ్నిపరీక్ష ప్రోగ్రామ్' కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్‌లోకి వచ్చే సెలబ్రిటీల జాబితా కూడా రెడీ అయిపోయిందని టాక్‌. ఆ జాబితాలో నటి రీతూ చౌదరి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యూటీ.. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రూ.750 కోట్ల స్కామ్‌లో పేరు బయటకు రావడంతో పెద్ద సంచలనం సృష్టించింది.

Details

నెగటివిటీని తగ్గించుకోవడానికి ప్రయత్నం

ఆ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా, చర్చ మాత్రం ఆగలేదు. తర్వాత బెట్టింగ్ యాప్స్ కేసులో కూడా ఆమె పేరు తెరపైకి రావడంతో మరోసారి వివాదాలకు తావిచ్చింది. ఇలాంటి కాంట్రవర్సీల మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి రీతూ చౌదరి వస్తే రచ్చ మామూలుగా ఉండదని టాక్‌. సోషల్ మీడియాలో ఆమె అందాలను ఆరబోసే స్టైల్‌కి ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే బిగ్ బాస్‌లో కూడా ఆమె ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. మరోవైపు, తన మీద ఉన్న నెగటివిటీని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ షోలో పాల్గొనాలని నిర్ణయించుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.