Udit Narayan : లైవ్ షోలో వివాదాస్పద లిప్ కిస్.. 69 ఏళ్ళ సీనియర్ సింగర్ పై విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో సింగర్స్ లైవ్ కాన్సర్ట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
ఈ షోలకు అభిమానులు వేలాదిగా హాజరవుతూ తమ అభిమాన గాయకులను ప్రత్యక్షంగా చూడటానికి, కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ లైవ్ షోలలో కొన్ని ఘటనలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.
ఇప్పుడు అలాంటి ఓ ఘటన సీనియర్ గాయకుడు 'ఉదిత్ నారాయణ్' లైవ్ షోలో పెద్ద చర్చకు దారి తీసింది.
హిందీ, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ 69 ఏళ్ల వయసులోనూ తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
Details
నెట్టింట వైరల్
నిన్న జరిగిన ఓ లైవ్ షోలో ఆయన పాటలు పాడుతుండగా, స్టేజి దగ్గరకు వచ్చి కొంతమంది అమ్మాయిలు సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు.
సెల్ఫీల కోసం ఫ్యాన్స్ స్టేజ్ వద్దకు రావడంతో, ఉదిత్ నారాయణ్ పాట పాడుతూనే స్టేజీపై కూర్చొని వారికి ఫోజులు ఇచ్చారు.
ఈ క్రమంలో కొన్ని అమ్మాయిలు సెల్ఫీలు తీసుకున్న తర్వాత, ఉదిత్ నారాయణ్ వారిని బుగ్గపై ముద్దు పెట్టారు. అయితే ఓ అమ్మాయి దగ్గరకు రాగానే ఆయన ఆమెను దగ్గరికి తీసుకొని లిప్ కిస్ పెట్టారు.
ఈ ఘటన వీడియో రూపంలో రికార్డు కావడంతో, అది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఇలాంటి చేష్టలేమిటని కొందరు మండిపడుతున్నారు.
Details
ట్రోల్స్ పై విమర్శలు
ఉదిత్ నారాయణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ట్రోల్స్ పెడుతున్నారు.
ఉదయం నుంచి ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు జరుగుతూనే ఉన్నాయి. అభిమానులకు తనంటే చాలా ఇష్టమని, వారు తమ ప్రేమను వ్యక్తం చేయడంలో భిన్నమైన రీతులు ఉంటాయని ఉదిత్ నారాయణ్ పేర్కొన్నారు.
కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారని, మరికొందరు ఆనందంతో ముద్దు పెడతారన్నారు. ఇది కేవలం ఆత్మీయత మాత్రమేనని, ఎవరికైనా అసౌకర్యం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నారు.
ఈ వివరణతో వివాదం కొంతమేర సద్దుమణిగినా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి.