మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నవ్వుల వర్షానికి హద్దులు లేవంటూ ఖతర్నాక్ అప్డేట్ ఇచ్చేసారు
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిత్రబృందం, తాజాగా క్రేజీ అప్డేట్ తో ముందుకు వచ్చారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సెన్సార్ పూర్తయిందని, ఇక నవ్వుల వర్షానికి హద్దులు లేవని ట్వీట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తుంటే, అనుష్క శెట్టి చెఫ్ పాత్రలో అలరించనున్నారు. రాధన్ సంగీతం అందించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.